Monday, April 29, 2024

పారిశుధ్య కార్మికులుగా సర్పంచ్, ఉపసర్పంచ్

ఉట్నూర్, జులై10 (ప్రభ న్యూస్) : గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు నిరవదిక సమ్మెలో పాల్గొనడంతో వీధుల్లో చెత్త కూరుకపోగా.. సర్పంచ్, ఉప సర్పంచ్ కార్మికులుగా మారి చెత్తాచెదాన్ని తొలగించారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్ గ్రామపంచాయతీలో ఇవాళ సర్పంచ్ గుండాల మల్లిక, ఉప సర్పంచ్ కేశవులు కార్మికులుగా మారారు.

ఉప సర్పంచ్ కేశవ్ ట్రాక్టర్ నడపగా.. సర్పంచ్ మల్లిక వీధుల్లోని చెత్త ట్రాక్టర్ లో వేసి ఊరు బయట డంపింగ్ యార్డ్ కు తీసుకెళ్లారు. పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో పంచాయతీలో పారిశుధ్యం పేరుకుపోకుండా ఉండడానికి స్వయంగా పారిశుద్ధ్య పనులు చేశామని సర్పంచ్ మల్లిక తెలిపారు. ప్రజలు చెత్తా చెదారాన్ని రోడ్లపై వేయకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆమె కోరారు. స్వయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పారిశుద్ధ్య పనులు చేసి ఆదర్శంగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement