Thursday, May 2, 2024

ADB: అమ్మవారిని దర్శించుకున్న‌ గేయ రచయిత అందె శ్రీ

బాసర, జనవరి 5(ప్రభ న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని సోమవారం గేయ రచయిత, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన రచయిత అందె శ్రీ అమ్మవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయ‌న‌కు ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాలతో సాదర స్వాగతం పలికారు.

- Advertisement -

అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించి, హారతినిచ్చి ఆశీర్వదించారు. ఆలయ ఈవో విజయ రామారావు రచయిత అందెశ్రీ ని శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గేయ రచయిత అందెశ్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కలలకు కళాకారులకు కొదవలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుల తల్లి కొలువు తీరి ఉండడం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. ఆయ‌న వెంట పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, స్థానిక భాజపా నాయకులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement