Friday, May 3, 2024

KHM: ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై వీగిపోయిన అవిశ్వాసం..

ఇల్లందు…. ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై అసమ్మతి వార్డు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. గతంలో అధికార పార్టీకి చెందిన 19మంది వార్డు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం కోరుతూ వినతిపత్రం అందజేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ శిరీష నేతృత్వంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అవిశ్వాసం కోరిన అసమ్మతి వార్డు కౌన్సిలర్లు క్యాంపు నుండి మున్సిపల్ కార్యాలయంకు చేరుకోగానే ఇద్దరు వార్డు కౌన్సిలర్లను అధికార పార్టీ కిడ్నాప్ చేసిందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మాన సమావేశానికి 15మంది వార్డు కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం ఉన్న 24 వార్డు కౌన్సిలర్లలో మూడో వంతు సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అంటే 17మంది వార్డు కౌన్సిలర్లు సమావేశంలో ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది. అవిశ్వాసం కోరిన వార్డు కౌన్సిలర్లు 15మంది హాజరుకావడంతో ఆర్డీవో శిరీష చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందని ప్రకటించారు.

ఇదిలా ఉండగా సమావేశానికి హాజరైన అసమ్మతి వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అవిశ్వాస తీర్మానానికి హాజరైన తమ వార్డు కౌన్సిలర్లను పోలీసుల కళ్ళ ఎదుటే కిడ్నాప్ చేశారని ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement