Friday, May 3, 2024

కౌలు రైతులను విస్మరించిన ప్రభుత్వం..

కాసిపేట : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కౌలు రైతులను పూర్తిగా విస్మరించిందని కాంగ్రెస్ ‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి ఆరోపించాడు. కాసిపేట మండలం మల్కేపెల్లి గ్రామానికి చెందిన మృతుడు కౌలురైతు శంకర్‌ కుటుంబ సభ్యులను కలిసి ఆయన పరమార్శించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, స్వంత భూమిలేని పేద, మధ్య తరగతి రైతులు వ్యవసాయాన్ని నమ్ముకుని భూ యజమానుల వద్ద వారి వెసులుబాటునుపట్టి సాగు భూములు కౌలుకు తీసుకుంటారన్నారు.ఇలాంటి వారు రాష్ట్రంలో లక్షల్లో వున్నారని వీరి సంగతిని ఏనాడు పట్టించుకున్న, ఆలోచన చేసిన సంధర్భాలు లేవన్నారు. వందల ఎకరాలున్న భూస్వాములకు రైతుబందు, రైతుభీమా అమలుచేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కౌలు రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పునరాలోచించాలని సూచించారు. అప్పలు చేసి పంటలు పండించే కౌలు రైతులు కాలం కలిసిరాక, దిగుబడులు తగ్గి, సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక మానసిక ఆందోళనలకుగురవుతున్నారని, కొంత మంది భూ యజమానులు, అప్పులిచ్చినవారి వేదింపులు తట్టుకోలేక విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నరని పేర్కొన్నారు. ఇప్పటికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులపట్ల సముచిత న్యాయం కోసం ఆలోచనచేసి ఆదుకోవాలని కోరారు. చనిపోయిన కౌలు కుటుంబ సభ్యులకు 25 లక్షల ఎక్సిగ్రేషియో ప్రకటించాలని, మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, కౌలు రైతులకు సైతం రైతుబందు అమలుచేయాలని, రాష్ట్రంలో మరే కౌలు రైతు బలవన్మరణాలకు పాల్పడకుండా ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశాడు. జీవన్‌రెడ్డి వెంట అధికార ప్రతినిధి సత్యం, మండల పార్టి అధ్యక్షుడు సిద్దం తిరుపతి, ప్రదాన కార్యధర్శి వేముల కృష్ణ నాయకులు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement