Tuesday, May 14, 2024

సేవా సహకారమే వారి లక్ష్యం..

బెల్లంపల్లి: సేవా సహకారమే వారి లక్ష్యంగా, జనహితమే వారి అభిమతంగా 4 సంవత్సరాల నుండి బెల్లంపల్లి, పరిసర ప్రాంతాల్లో సేవలు అందిస్తూ జన హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జనహిత సేవా సమితీ. 2017 మార్చి 29వ తేదిన 20 మంది మిత్రులు కలిసి ప్రజలకు, పేదలకు సేవలు అందించాలనే లక్ష్యంతో సభ్యులు, మిత్రులు, దాతల సహకారంతో సేవా సమితీని ప్రారంభించి చలివేంద్రంతో మొదలైన వీరి సేవ అంచెలంచెలుగా బెల్లంపల్లి పట్టణంలో ఎవరికి ఆపద వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాల్లో, రక్తధాన శిబిరాల్లో ప్రతీనోట సేవ అంటే జనహిత సేవా సమితిగా వ్యాపించి 20 మందితో మొదలైన ఈ సేవ 100 మందికి పైగా సభ్యులుగా ఏర్పాటై వీరి సేవను కొనసాగిస్తున్నారు. సేవల్లో భాగంగా ప్రతీ ఆదివారం ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు అల్పాహారం, పాలు పంపిణీ. ప్రతీ వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్చమైన నీటితో చలివేంద్రాల ఏర్పాటు. అదేవిదంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతీఒక్కరికి తెలియజేస్తూ మట్టి గణపతుల పంపిణీ చేస్తూ ఒకవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు సహాయ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎవరికి ఆపద వచ్చినా మేమున్నామంటూ వారు తలుపు తట్టి ఎంతో మంది దాతల సహకారంతో చాలా మందికి వైద్యం కోసం విరాళాల ద్వారా సహాయాన్ని అందిస్తూ వారి సేవను చాటుతున్నారు. అదేవిధంగా తలసేమియా సికిల్‌ సెల్‌ వ్యాదిగ్రస్తుల కోసం రెడ్‌క్రాస్‌ సొసైటీలో రక్తనిల్వలు అందుబాటులో లేనప్పుడు రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా రక్తనిల్వలు తగ్గకుండా ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకుంటూ వందలాది మందితో రక్తధాన శిబిరాలను ఏర్పాటు చేసి పలువురి మన్ననలు పొందుతున్నారు. ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారంలో మొక్కలు నాటుతూ అదేవిధంగా పర్యావరణ రక్షణ కోసం అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులు, బట్ట సంచులను పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పలువురికి అవగాహన కల్పిస్తూ ప్రభుత్వానికి తోడ్పాటుగా నిలుస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే వారు చేస్తున్న సేవలకు అనేక అవార్డులు, పురస్కారాలు అందుకుంటూ బెల్లంపల్లి, పరిసర ప్రాంతాల్లో సేవలను అందిస్తూ సమాజంలో ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. నేత్ర అవయవ దానంపై ఇప్పటికే అవగాహన కల్పించి కుటుంబసభ్యుల ద్వారా మూడు నేత్ర దానాలను నిర్వహించి అంధులకు కంటి చూపును ఇవ్వడం జరిగింది. నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సభ్యులు, దాతల సహకారంతో ఉగాది పర్వదినం నుండి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు తీర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. జనహిత సేవా సమితి ద్వారా చేస్తున్న సేవలను ప్రతీఒక్కరు గుర్తించి వారి సేవలో భాగస్వామ్యులై ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు.

సభ్యులు, దాతల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు ముందుంటాం
జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ : కేవలం 20 మంది సభ్యులతో మొదలైన జనహిత సేవా సమితీ నాలుగు సంవత్సరాల్లో అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు సేవ చేయడం జరుగుతుందని, అంతేకాకుండా దాతలు, సభ్యుల సహకారంతో మరిన్ని సేవలు అందించేందుకు జనహిత సేవా సమితీ ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌ అన్నారు. సేవ చేయడంలో ఉన్న ఆనంధం ఎందులో లేదని, సేవే లక్ష్యంగా జనహిత సేవా సమితీని సభ్యుల సహకారంతో ముందుకు తీసుకువెళ్తున్నామని, రానున్న రోజుల్లో మా సేవలను మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

సేవలు అందించడంలో తెలియని తృప్తి
జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి : సేవలు అందించడంలో ఎంతో మదురమైన తృప్తి దాగుందని తెలుసుకోవడం జరిగిందని, జనహిత సేవా సమితీ ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి తెలిపారు. జనహిత సేవా సమితిని ప్రారంభించినప్పటి నుండి తనవంతుగా సేవలు అందిస్తూ తాను చేసే చిన్న ఉద్యోగం నుండే తనవంతు సహకారం అందించడంలో ఎంతో ముందుంటూ తన తల్లి గారైన ఇప్ప అమ్మక్క నేత్రాలను కూడా దానం చేసి మరొకరికి చూపును అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జనహిత సేవా సమితి కార్యక్రమాలు చూసి ఎంతో మంది సేవ చేయాలని ముందుకు రావడం ఆనంధంగా ఉందని అన్నారు.

ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ముందుకు వెళ్తాం
జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌ : గత నాలుగు సంవత్సరాలుగా జనహిత సేవా సమితీ ద్వారా అందిస్తున్న ప్రతీ సేవా కార్యక్రమంలో ముందుంటూ తమవంతు సేవలు అందించడం జరుగుతుందని కార్య నిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్‌కుమార్‌ అన్నారు. జనహిత సేవా సమితీ ద్వారా ఇప్పటికే చాలా సేవ సహకార కార్యక్రమాలను అందించడం జరిగిందని, అంతేకాకుండా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మేము చేసే ప్రతీ సేవా కార్యక్రమాల్లో అందరిని భాగస్వామ్యులను చేస్తూ ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా రానున్న కార్యక్రమాల్లో కూడా అందరి సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని
అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement