Monday, April 29, 2024

ADB: ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు చేదు అనుభవం

భీమిని, (ప్రభ న్యూస్) : భీమిని మండలం చిన్న గుడిపేట గ్రామంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు చేదు అనుభవం ఎదురైంది. ప్రచారం కోసం చిన్న గుడిపేటకు వచ్చిన ఎమ్మెల్ కోనేరు కోనప్ప ను గ్రామంలోకి రాకుండా బండ్లు, వాహనాలను అడ్డంపెట్టి ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

ఎన్నికప్పుడే గుర్తొచ్చామా అంటూ నిలదీశారు. అడ్డంగా ఉంచిన వాహనాలను తొలగించడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే కోనప్ప అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఐదు సంవత్సరాల కాలంలో రహదారుల నిర్మించక పోగా.. ఓట్ల కోసం ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement