Tuesday, April 30, 2024

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి

కుంటాల, జూన్ 9 (ప్రభ‌ న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలులోకి వచ్చాయ‌ని, ఆసరా పింఛ‌న్ పథకం ద్వారా దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక పింఛ‌న్లు ఇచ్చిన రాష్ట్రం మన తెలంగాణ అని ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో జరిగిన ద‌శాబ్ది ఉత్స‌వాల్లో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక లక్ష 16 రూపాయిలు ఇస్తూ ఒక మేనమామ కట్నం లాగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో మన కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకం ఉంటుంద‌న్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల పుడితే 13 వేయిలు, మగ పిల్లవాడు పుడితే 12 వేయిల రూపాయిలను అందిస్తున్న ఏకైక రాష్ట్ర‌ తెలంగాణ అన్నారు.

గురుకులాలు ఎన్నో నిర్మించి ప్రతి విద్యార్థి పైన సుమారు ఒక లక్ష 30 వేయిల రూపాయిలు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబు, భైంసా జడ్పీటీసీ సోలాంకి దీప భీమ్ రావు, బాసర జడ్పీటీసీ వసంత రమేష్, కుంటాల జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, ముధోల్ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, లోకేశ్వరం ఎంపీపీ లలిత భోజన్న, భైంసా ఏఎంసీ వైస్ చైర్మన్ జేకే పటిల్ కుబీర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్, భైంసా మండల కో ఆప్షన్ సభ్యులు గజనాన్, తానూర్ మండల కన్వీనర్ పోతారెడ్డి భైంసా మండల బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఫరూక్ అహ్మద్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement