Saturday, May 11, 2024

కరోనా పరీక్షలు చేయించిన కౌన్సిలర్..

బెల్లంపల్లి : మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో 80 మందికి కరోనా వైరస్‌ పరీక్షలను నిర్వహించగా 10 మందికి పాజిటీవ్‌ వచ్చినట్లు వార్డు కౌన్సిలర్ ‌పోలు ఉమాదేవి-శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్‌ మాట్లాడుతూ వార్డులో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కరోనా కట్టడిపై కౌన్సిలర్లతో సమీక్షించి సూచనలు చేసిన మేరకు ఈ పరీక్షలను నిర్వహించారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెకండ్‌ వేవ్‌ కరోనా చాలా ప్రమాధకరమని, వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటే వైరస్‌ సోకిన వారం లోపే మనిషి చనిపోయే ప్రమాదం ఉందని, లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా 45 సంవత్సరాల పైబడిన వారంతా వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. అవసరమైతే తప్ప ఎవరుకు బయటకు వెళ్లవద్దని, మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస మహిళా నాయకురాలు పాత రమాదేవి, ఏఎస్సై తిరుపతి, రైటర్‌ చుక్కయ్య, తెరాస నాయకులు పోలు శ్రీనివాస్‌, జన్నం సత్యనారాయణ, లక్ష్మి, రాజం, మడుపు రవికుమార్‌, కుంభం ఓదెలు, సురేష్‌, గుమ్మడి కృష్ణంరాజు, గోమాస సాయి క్రాంతి, కాసర్ల రమేష్‌, నామసాని మణి, భూంపెల్లి కార్తిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement