Sunday, April 28, 2024

పవన్ ఆలనాపాలన చూసుకుంటున్న యంగ్ ప్రొడ్యూసర్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా పవన్ ను ఓ యంగ్ ప్రొడ్యూసర్ దగ్గరుండి చూసుకుంటున్నారట. అయితే ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదట. సూర్యదేవర నాగ వంశీ. పవన్ తో ఎప్పటినుంచో మంచి సంబంధాలు నాగ వంశీకి ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే పవన్ పక్కనే ఉండి నాగ వంశీ కేర్ తీసుకుని చూస్కుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి రావాలి అంటూ అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియం రిమేక్ లో పవన్ నటిస్తున్నాడు.అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ కు నాగ వంశీ తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement