Monday, July 22, 2024

Election | ఏపీలో 144 సెక్షన్.. సైలెన్స్ పీరియడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఈసీ

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సీఈవో ముఖేష్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా… పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని తెలిపారు.

ఆయా నియోజకవర్గాల్లో 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.. రాజకీయ ప్రచారం పూర్తిగా నిలిచిపోతుందన్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం లోగా EVM మెషిన్లు పోలింగ్ కేంద్రాలకు చేరతాయి. ఉదయం 7 లోపు మాక్ పోలింగ్ పూర్తి చేసి పోలింగ్ ప్రారంభించాలి. పోలింగ్ స్టేషన్ లో ఒక పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఉండాలి. పోలింగ్ స్టేషన్ కు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయకూడదు. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్ చేయకూడదు అని తెలిపారు.

రాష్ట్రంలో 10,30,000 మంది యువ ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని వివరించారు. ఇక, 46,389 పోలింగ్ స్టేషన్ లలో 12,438 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఉంటుందని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement