Saturday, May 4, 2024

ADB : ఘనంగా స్వామి వివేకానంద 61వ జయంతి వేడుకలు

బాసర, జనవరి 12 (ప్రభ న్యూస్): మండల కేంద్రంలో శుక్రవారం స్వామి వివేకానంద ఒక్ 100 61వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపానగల స్వామి వివేకానంద విగ్రహానికి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్సింగరావు, మాజీ సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయినాథ్ పటేల్, బిజెపి నాయకులు బి రమేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వివేకనంద అడుగుజాడల్లో నడవాలని ఆయన మాటలే యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివేకానంద యూత్ సభ్యులు జాదవ్ కృష్ణ, చంద్రమోహన్, గోపాల్ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement