Sunday, April 28, 2024

బత్తుల సుదర్శన్‌కు జ్ఞాపిక..

బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సహకారంతో వాసవి భజన బృందం సహాయ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రిచే వాణినికేతన్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 7వ రోజు ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ ముఖ్య అతిథిగా హాజరై బాచుపల్లి సంతోష్‌ కుమార్‌చే సత్కారాన్ని అందుకొని, ఆశీస్సులను పొందారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్‌, పట్టణ కౌన్సిలర్‌ నీలి కృష్ణ, ఆర్యవైశ్యులు రేణికుంట్ల శ్రీనివాస్‌, పాత భాస్కర్‌, నందయ్య, పెద్ది రాజు, నల్మాస్‌ సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement