Friday, May 3, 2024

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్!

బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం వేరే దారిలో నడిచింది. పైపైకి కదిలింది. బంగారం కొనే వారికి ఇది గుడ్ న్యూ్స్ అని చెప్పొచ్చు.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. దీంతో రేటు రూ.45,490కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 తగ్గుదలతో రూ.41,700కు క్షీణించింది.

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement