Monday, April 29, 2024

ఏఐటీయూసీలో పలువురి చేరిక..

శ్రీరాంపూర్‌ : ఏరియాలోని వర్క్‌షాప్‌లో జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఫిట్‌ కార్యదర్శి ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ఏఐటీయూసీ యూనియన్‌లో చేరారు. వారిని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.బాజీసైదా, కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బాంచ్‌ కార్యదర్శి కొట్టె కిషన్‌రావులు హాజరై ఖండువాలతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఏరియా వర్క్‌షాపులో పనిచేస్తున్న ఉద్యోగులు ఏఐటీయూసీ సిద్దాంతాలకు, పోరాటాలకు ఆకర్షితులై ఏఐటీయూసీలో చేరుతున్నందుకు అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సింగరేణి ఉద్యోగులకు గనులు, డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల వద్ద వ్యాక్సిన్‌ వేయాలని కోరారు. డిస్పెన్సరిలలో కేవలం 60 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేస్తున్నారని, దాని వల్ల వ్యాక్సినేషన్‌ ఆలస్యమవుతుందని, గనులు, డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్లో కూడా వ్యాక్సిన్‌ వేయాలని, అలా అయితేనే కార్మికులందరికి వ్యాక్సిన్‌ అందుతుందని సీతారామయ్య యాజమాన్యాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల లక్ష్మణ్‌, సారయ్య, ముత్యాల శ్రీనివాస్‌, రాఘవరాజు, యాదగిరి, మల్లారెడ్డి, సందీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement