Friday, April 26, 2024

ఏఐటీయూసి ధర్నా..

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేట 2వ గనిపై ఏఐటీయూసీ ఆద్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సంధర్భంగా బెల్లంపల్లి బ్రాంచి ఇన్‌చార్జ్‌ చిప్ప నర్సయ్య మాట్లాడుతూ, ఏరియాలోని గనుల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని దాంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాసిపేటగనిలో అధికారుల నిర్లక్షం వలన రెండు మాసాలుగా ఉత్పత్తి పడిపోయిందని, ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని, కాసిపేట 2గనిలో కాంట్రాక్టీకరణ చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, సింగరేని క్వార్టర్లలో వుంటున్న కార్మికేతరులను కాలీ చేయించాలని, ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని, కాసిపేట 1,2 గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు, వారి కుటుంబసభ్యులకు వైద్య సేవలందించాలన్నారు. ఈ సమస్యలపరిష్కారానికి యాజమాన్యం చర్చలు చేపట్టాలని లేకుంటే ఈ నెల 27న జియం కార్యాలయాలు, మే 3న ఛలో కొత్తగూడం ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం సమస్యల పత్రాన్ని గని మెనేజర్‌ రవీందర్‌ కు అందించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షులు దాగం మల్లేష్‌,ఫిట్‌ కార్యధర్శి వెంకటేశ్వర్లు నాయకులు, కార్మికులు తదితరు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement