Thursday, May 9, 2024

భారత్‌కా అమృత్‌ మహోత్సవ్

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్‌లోని జీఎం కార్యాలయంలో భారత్‌కా అమృత్‌ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఏరియా జీఎం ఎం.సురేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ 75 వసంతాల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని ఎందరో మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ 75 వారాల పాటు భారత్‌కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 12వ తేది నుండి మార్చి 20వ తేది వరకు కార్పోరేట్‌, అన్ని ఏరియాల్లోని సింగరేణిలో గల అన్ని ఏరియాల్లో జీఎం కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మార్చి 21వ తేది నుండి మార్చి 30వ తేది వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్‌ ఉపాధ్యక్షుడు కె.సురేందర్‌ రెడ్డి, సీఎంఓఏఐ సెక్రటరి మాధవ్‌, ఏరియా ఇంజనీర్‌ కుమార్‌, ఏజీఎం ఫైనాన్స్‌ పద్మారావు, ఉపరితల గని ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పురుషోత్తం రెడ్డి, డీజీఎం (ఐఈడీ) చిరంజీవులు, డీజీఎం (పర్సనల్‌) గోవిందరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement