Wednesday, May 1, 2024

ADB: మంత్రిపై చర్యలు తీసుకోవాలి.. గిరిజనుల రాస్తారోకో

ముధోల్, (ప్రభ న్యూస్) : రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని గిరిజనులు రోడ్డెక్కారు. సోమవారం మండల కేంద్రమైన ముధోల్ లోని బైంసా-బాసర జాతీయ రహదారిపై అంబేద్కర్ చౌక్ లో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాదులో మంత్రి కేటీఆర్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబును నెట్టేసి చెంపదెబ్బ కొట్టడాన్ని గిరిజన నాయకులు ఖండించారు.

ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ… బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయి చేసుకోవడంపై మండిపడ్డారు. సాయంత్రం వరకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మంత్రిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సైకి గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వెంకటాపూర్ రాజేందర్, విజేష్, ధూమా నాయక్, సత్తయ్య గౌడ్, అభిమానులు, తదితరులు, పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement