Sunday, April 28, 2024

TS: గొర్రెల‌ స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగ‌వంతం చేసింది. కాంట్రాక్ట‌ర్ మోహియుద్దీన్ 120యూనిట్ల గొర్రెలను ఏపీకి చెందిన రైతుల దగ్గర కొనుగోలు చేసి.. రూ.2 కోట్ల10లక్షల రైతులకు చెల్లించకుండా తన బినామీ ఖాతాలోకి మళ్లించారు. ఇందులో కాంట్రాక్టర్ కు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లు విక్రమ్, శివ సాయిలు సహకరించారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు పశు సంవర్దకశాఖ అధికారులు, కాంట్రాక్టర్ మోహియుద్దీన్ తమ వద్ద గొర్రెలు కొనుగోలు చేశారని రైతులు అంటున్నారు. గొర్రెల స్కీంలో భారీగా అవినీతి జరిగినట్టు ఇప్పటికే కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్ డీ కళ్యాణ్ పాత్ర పై ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement