Friday, May 3, 2024

TS: ఎల్బీనగర్ లో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఎల్బీనగర్, ఫిబ్రవరి 19(ప్రభ న్యూస్): చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఎల్. బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ , చైతన్యపురి సాయి నగర్ లో శివాజీ మహారాజ్ విగ్రహానికి ఎల్. బి నగర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .మరాఠా సామ్రాజన్ని నెలకొల్పి మచ్చలేని వ్యక్తిత్వంలో మతసామరస్యంతో స్త్రీలను గౌరవించడం ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రం పాటించిన సాహసి, సహన శీలి వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కళ్లెం నర్సింహా రెడ్డి, కెకెసి రాష్ట్ర నాయకులు రాజశేఖర్ రెడ్డి,మన్సూరాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు ఆలూరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement