Wednesday, May 15, 2024

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఒకే రోజు 44 ప్ర‌స‌వాలు…

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గ‌ర్భిణులు ప్ర‌స‌వించారు. 44 మంది శిశువుల‌కు వైద్యులు పురుడు పోశారు. గర్భిణులంతా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాతో పాటు ఇత‌ర జిల్లాల‌కు చెందిన వారు అని ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ రామ్ కిష‌న్ మీడియా స‌మావేశంలో తెలిపారు. తెలిపారు. 44 మందిలో కొంద‌రికి నార్మ‌ల్ డెలివ‌రీ కాగా, ఇంకొంద‌రికి సీజేరియ‌న్లు జ‌రిగాయి.

కాన్పు జరిగిన 44 మంది స్త్రీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రంగ రెడ్డి, వికారాబాద్ జిల్లా ల నుండి వచ్చారని తెలిపారు ముఖ్యంగా కాన్పు ల్లో జన్మించిన 44 మందిలో 25 మంది మగ శిశువులు కాగా 19 మంది ఆడ శిశువులని వివరించారు. వీరిలో నార్మల్ డెలివరీ 23 ఉండగా, సిజరియన్స్ డెలివరీలు 21 జరిగాయని సూచించారు. అవసరమైన వారికి లో బర్త్ వెయిట్ వున్న వారు SNCU లో అడ్మిట్ చేశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ రామ్ కిషన్ OBG విభాగంలోని వైద్యులు HOD& ప్రొఫెసర్ Dr. రాధ, Dr. లక్ష్మి పద్మ ప్రియ, Dr. సరిత, Dr. స్ఫూర్తి, Dr. సింధూర, Dr. ధృవిత, Dr. అపురూప, Dr. నాగ ప్రవలిక, Dr. శిరీష, Dr. జ్యోతిర్మయి, Dr. ప్రవళిక లను అభినందించారు.

కాగా, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా కేటీఆర్ కిట్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లుతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో డెలివ‌రీల సంఖ్య పెరిగిన విష‌యం విదిత‌మే. ఇక గ‌ర్భిణిల‌కు నార్మ‌ల్ డెలివ‌రీలు చేసేందుకు వైద్యులు ప్రాధాన్య‌త ఇస్తున్నారు. బాలింత‌ల‌ను ఇంటికి త‌ర‌లించేందుకు అమ్మ ఒడి వాహ‌నాల‌ను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గ‌ర్భిణుల‌కు ఐర‌న్, ఫోలిక్ యాసిడ్ వంటి మెడిసిన్స్‌ను ఆరోగ్య ల‌క్ష్మి ప‌థ‌కం కింద అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement