Sunday, May 5, 2024

తెలంగాణలో 19 మంది డీఎస్పీల బదిలీ

తెలంగాణలో 19 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోస్టింగ్‌ కోసం వెయింగ్‌లో ఉన్న జీ హనుమంత రావును కూకట్‌పల్లి ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్‌ ఏసీపీగా ఉన్న ఏ చంద్రశేఖర్‌ను కూకట్‌పల్లి ఏసీపీగా నియమించారు. కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న బీ సురేందర్‌ రావును సైబరాబాద్‌ ఏసీపీ, ఎస్బీగా బదిలీ చేశారు. ఇబ్రహింపట్నం ఏసీపీగా ఉన్న వై యాదగిరి రెడ్డిని రాచకొండ సీపీ ఆఫీస్‌లో, జగిత్యాల ఎస్డీపీఓగా ఉన్న పీ వెంకటరణ, చౌటుప్పల్‌ ఏసీపీగా ఉన్న పీ సత్తయ్య, గద్వాల డీఎస్పీ ఏ యాదగిరిని చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement