Thursday, April 25, 2024

పుష్ప రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. అయితే అదే సమయంలో మరికొన్ని భారీ చిత్రాలు రిలీజ్ కావస్తుండడంతో కొత్త డేట్స్ ను వెతుక్కునే పనిలో ఉన్నారు పుష్పా యూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 24న కానీ అంతకుముందు వారంలో కానీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement