Sunday, May 5, 2024

Smart Tech: ఈ ఫీచర్స్ ఉంటేనే స్మార్ట్ ఫోన్ కొనాలి.. లేటెస్ట్ ట్రెండ్స్ ఇవే..

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలంటే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఇవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఈ ఏడాది నుంచి రాబోయే కొన్నేళ్లలో ఏయే అంశాల ఆధారంగా వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయబోతున్నారు అనే అంశం మీద ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ Flipkart కొన్ని వివరాలు వెల్లడించింది. 5G phoneలకు ఈమధ్య విపరీతంగా ఆదరణ పెరిగినట్లు ఆ సంస్థ వెల్లడించింది. రాబోయే కొన్నేళ్లపాటు 5G స్మార్ట్ ఫోన్లకు ఎక్కువ గిరాకీ ఉంటుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు ఇప్పటివరకు 64 మెగా పిక్సెల్ కెమెరా కలిగిన ఫోన్లతో సరిపెట్టుకున్న వినియోగదారులు.. ఇప్పుడిప్పుడే 108 మెగాపిక్సెల్ రిజల్యూషన్ ఉన్న ఫోన్ల వైపు దృష్టి సారిస్తున్నారు. మున్ముందు ఇంతకన్నా మరింత ఎక్కువ కెమెరా క్వాలిటీ గురించి యూజర్లు ఆలోచించే అవకాశం ఉంది.

Under display selfie camera కలిగిన మొట్టమొదటి ఫోన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇకమీదట ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే ఇలాంటి ఫీచర్లని దృష్టిలో పెట్టుకొని యూజర్లు ఫోన్లను కొనే అవకాశం కూడా ఉందని Flipkart చెబుతోంది. దీంతోపాటు వినియోగదారుల ఎప్పటికప్పుడు ఫోన్ పనితీరుపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు ఫ్లిఫ్ కార్ట్ గమనించింది. 5nm ప్రాసెసర్లు అందుబాటులోకి రావడం, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఇతర ఫీచర్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండడంతో కంప్యుటేషనల్ ఫొటోగ్రఫీ ఇంపార్టెన్స్ సంతరించుకుంటోందని.. ఇక ముందు ఫోన్ లలో ఇది కీలకంగా మారబోతోందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు బ్యాటరీల పరంగా కూడా నిన్న మొన్నటి దాకా 5000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా ఉంటే ఇప్పుడు ఏకంగా 6000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలు ప్రామాణికంగా మారుతున్నాయి. మరోవైపు ఇప్పుడు వాడకంలో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కంటే మరింత శక్తివంతమైన 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోన్లకి విపరీతంగా ఆదరణ పెరుగుతున్నట్టు టెకీలు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మనం ఫోన్ లను వాడుతున్న తీరుకి భిన్నమైన, మరింత శక్తివంతమైన phoneలను రాబోయే రెండు మూడేళ్లలో ఉపయోగించబోతున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement