Sunday, May 19, 2024

నా ఆస్తులు ఇవే – నాపై ఎటువంటి క్రిమిన‌ల్ కేసులు లేవ్ – యోగి ఆదిత్య‌నాథ్

మొద‌టిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు యోగి ఆదిత్య‌నాథ్. ఈ మేర‌కు ఆయ‌న నిన్న గోర‌ఖ్ పుర్ శాస‌స‌న‌స‌భ స్థానం నుండి నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఎస్పీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్ త‌న‌కు 17.22కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తులు ఉన్న‌ట్లు ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో తెలిపారు. ఈ మేర‌కు యోగి కూడా ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో త‌న ఆస్తుల వివ‌రాలు చెప్పారు. తనకు మొత్తం కోటి రూపాయ‌ల‌ 54 లక్షల 94 వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. అలాగే, రూ.12 వేలు విలువ కలిగిన ఓ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్‌, రూ. లక్ష విలువ ఉండే రివాల్వర్‌, రూ.80 విలువ కలిగిన మరో రైఫిల్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. రూ.49 వేల విలువ ఉండే బంగారు చెవి రింగు, రూ.20 వేల రుద్రాక్షహారం తన వద్ద ఉన్నట్లు యోగి వెల్ల‌డించారు. తనకు ఎటువంటి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు లేవని పేర్కొన్నారు. త‌న‌కు సొంత వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అలాగే, బ్యాంకుల్లో ఎటువంటి రుణాలూ లేవని, త‌న‌పై పెండింగ్‌లో ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement