Tuesday, May 7, 2024

డ‌బ్బింగ్ కంప్లీట్ – వైర‌ల్ గా వెంక‌టేష్ ఫొటో

ఎఫ్3 చిత్రానికి డ‌బ్బింగ్ పూర్తి చేశాడు హీరో వెంక‌టేష్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ ప్రాజెక్టు మే 27న థియేట‌ర‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ట్రైల‌ర్ కు డ‌బ్బింగ్ పూర్తయిందని చెప్పేందుకు చాలా ఎక్జ‌యిటింగ్‌గా ఉంద‌ని వెంకీ ట్వీట్ చేశాడు. డ‌బ్బింగ్ స్టూడియోలో వెంకీ ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్టో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ క్రేజీ మూవీలో త‌మ‌న్నా, మెహ‌రీన్, సోనాల్ చౌహాన్‌, అంజ‌లి, సునీల్‌, అన్న‌పూర్ణ‌మ్మ, వెన్నెల కిశోర్, రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పూజాహెగ్డే స్పెష‌ల్ సాంగ్ లో మెర‌వనుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఎఫ్ 3 లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement