Saturday, April 27, 2024

వావ్‌.. అద‌ర‌గొడుతున్న అవ‌తార్ 2 టీజ‌ర్ ట్రైల‌ర్.. అద్భుత‌మైన గ్రాఫిక్ ఎఫెక్ట్స్‌

ప్ర‌పంచ వెండితెరపై అవతార్ చిత్రం సృష్టించిన ప్రభంజనం మాట‌ల్లో చెప్ప‌లేనిది. అనేక భాషల్లోకి డబ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు డాలర్ల వర్షం కురిపించింది. 2009లో జేమ్స్ కామెరాన్ డైరెక్ష‌న్‌లో వచ్చిన అవతార్ ఆస్కార్ వేదికపైనా అవార్డుల పంట పండించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అవతార్-2 ఈ ఏడాది డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానున్న‌ట్టు కామెరాన్ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈసారి అవతార్ లో సముద్ర లోకాన్ని ఆవిష్కరించినట్టు టీజర్ ట్రైలర్ చెబుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలం అడుగడుగునా దర్శనమిస్తోంది. మొత్తమ్మీద టీజర్ ట్రైలర్ తోనే అవతార్-2పై అమితమైన ఆసక్తి రేకెత్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement