Sunday, May 19, 2024

యాపిల్ ఎయిర్ ట్యాగ్ తో.. పోయిన కారుని ప‌ట్టుకోవ‌చ్చు

పోయిన కారుని తాము నిమిషాల వ్య‌వ‌ధిలో కారు ఉన్న లొకేష‌న్ ని గుర్తిస్తామంటున్నారు అమెరికాకి చెందిన ఓ జంట‌. ఈ మేర‌కు పోలీసులకి స‌మ‌చారం ఇవ్వ‌డంతో వారు అక్కడికి వెళ్లి దొంగలను అరెస్టు చేశారని వెల్లడించారా జంట‌. యాపిల్ ఎయిర్ ట్యాగ్ సాయంతో పోయిందనుకున్న కారును తిరిగి దక్కించుకున్నామని చెప్పారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని క్యారీ టౌన్ కు చెందిన లెస్లీ మహమ్మద్ కారును ఇటీవల దొంగలు ఎత్తుకెళ్లారు. రాత్రి ఇంటిముందు పార్క్ చేసిన కారును ముగ్గురు దుండగులు తీసుకెళ్లారు. అప్పుడు మంచి నిద్రలో ఉన్న మహమ్మద్ ను యాపిల్ ఎయిర్ ట్యాగ్ అలర్ట్ చేసింది. నిద్రలోంచి లేచి చూడగా.. కారు ప్రయాణిస్తున్నట్లు మ్యాప్ చూపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement