Thursday, May 9, 2024

బండా ప్రకాష్ ని అభినందించిన మంత్రి గంగుల

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన బండా ప్రకాష్ ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీసీలపై అనంతమైన ప్రేమ ఉందని, సంక్షేమం, అభివృద్ధిలో బీసీలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రాజకీయ పదవులలోనూ వారికే అగ్రతాంబూలం ఇస్తున్నారన్నారు. అందుకు తార్కానమే బీసీ నేతకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అన్నారు. శాసన మండలి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement