Monday, April 29, 2024

Spl Story: క్లౌడ్​ బరస్ట్​ అంటే ఏమిటి.. ఎట్లా ఏర్పడుతుంది, ఎఫెక్ట్​ ఎట్లుంటది!

తెలంగాణలో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరదలు రావడంపై సీఎం కేసీఆర్​ కౌడ్​ బరస్ట్​ అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విదేశీ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు కొంతమంది నుంచి వ్యక్తం అవుతున్నాయన్నారు. దీంతో పొలిటికల్​ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.

‌– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

దీనిపై బీజేపీ లీడర్​ బండి సంజయ్​ మాట్లాడుతూ ‘‘వరదలు వస్తుంటే ప్రజలను ఆదుకోలేక.. సీఎం కేసీఆర్​ కొత్తరకం వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు”అని కామెంట్స్​ చేశారు. కాంగ్రెస్​ నేత రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. విదేశీ హస్తం ఉందని సీఎం కేసీఆర్​ అంటున్నారు కాబట్టి దేశ భద్రత దృష్ట్యా అదుపులోకి తీసుకుని దీనిపై విచారణ చేపట్టాలి”అని విమర్శించారు. అయితే.. దీనిపై టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు వెంటనే కౌంటర్​ అటాక్​ స్టార్ట్​ చేశారు. అసలు క్లౌడ్​ బరస్ట్​ అనేదానిపై సీఎం కేసీఆర్​కు ఉన్నంత అవగాహన ఈ బుడ్డ లీడర్లకు ఉందా? ఊరికే సొల్లు మాటలు, పనికిమాలిన విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారా? అని టీఆర్​ఎస్​ నేతలు కొంతమంది కౌంటర్​ అటాక్​ ప్రారంభించారు..  

వాస్తవానికి క్లౌడ్​ బరస్ట్​ అంటే ఏమిటంటే..

క్లౌడ్ బరస్ట్ అంటే.. ఒకటి నుండి 10 కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా వర్షపాతం నమోదైతే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు కూడా క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తాయి. అట్లాంటప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. క్లౌడ్ బరస్ట్ కు కారణాలు చాలా ఉంటాయి. అందులో భౌగోళిక, వాతావరణ పరిస్థితులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

ఇక.. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి కొంత తేమను తోడ్కొని వస్తాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి.

కాగా, పర్వతాలపై తరచూ ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది. అయితే.. సీఎం కేసీఆర్​ అన్నట్టు ఇందులో విదేశీయుల కోణం కూడా దాగి ఉందేమో? అనే అనుమానాలు కూడా చాలా మంది మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే, అమర్​నాథ్​ యాత్రపై టెర్రర్​ అటాక్​ జరుగుతుందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్​ వర్గాలు ముందే హెచ్చరించాయి. అదే క్రమంలో అమర్​నాథ్​ గుహ ప్రాంతంలో వేలాది మంది యాత్రికులు ఉన్నప్పుడే ఇట్లాంటి ఘటన జరగడం, ఇప్పుడు సీఎం కేసీఆర్​ కుట్రకోణం ఉందని చెప్పడం.. కొంత అనుమానాలను బలపరిచేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement