Saturday, April 27, 2024

Women Issue: ఈ సెక్సిస్ట్​ రూల్స్​ ఏంటి? బ్యాంకులపై మహిళా కమిషన్​ సీరియస్​..

బ్యాంకుల్లో ఆడాళ్లపై వివక్ష కొనసాగుతోందని, 1958లో తీసుకొచ్చిన రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ని ఇంకా అమలు చేయడమేంటని ఢిల్లీ విమెన్స్​ కమిషన్​ సీరియస్​ అయ్యింది. ప్రెగ్నెన్సీ విమెన్స్​ని బ్యాంకుల్లో అన్​ఫిట్​గా పేర్కొంటూ కండిషన్స్​ పెట్టడానన్ని సుమోటాగా స్వీకరించి బ్యాంకు జనరల్​ మేనేజర్​కు సమన్లు పంపింది.  మనం ఇంకా ఏ కాలంలో ఉన్నాం.. ఇంత పురుషాధిక్యత ఏంటని బ్యాంకు అధికారులకు రాసిన లేఖలో నిలదీశారు కమిషన్​ చైర్​పర్సన్​ స్వాతి మలివార్​..

ఇండియన్​ బ్యాంకులో మహిళా సిబ్బందికి ఎదురవుతున్న వివక్షపై మహిళ కమిషన్​ సీరియస్​ అయ్యింది. బ్యాంకులో మహిళా సిబ్బంది నియామకానికి సంబంధించిన వివక్షాపూరిత మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించిన ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (HRM)కి ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) సమన్లు ​​పంపింది. మహిళా ఉద్యోగురాలు మూడు నెలల గర్భిణి అయితే. ఆమెను తాత్కాలికంగా అన్‌ఫిట్ గా పేర్కొంటూ.. జాబ్​లోకి అనుమతి ఇవ్వకుండా బ్యాంక్ తన నిబంధనల్లో పేర్కొనడాన్ని తప్పుపట్టింది కమిషన్​.

ఇప్పుడీ మార్గదర్శకాలకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంతో ఢిల్లీ మహిళా ప్యానెల్ దీన్ని సుమోటోగా స్వీకరించింది. ఢిల్లీ మహిళా కమిషన్​ (DCW ) చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరుతూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT)కి లేఖ రాశారు. అయితే దీనిపై తాము ఎట్లాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని ఇండియన్ బ్యాంక్  స్పష్టం చేసింది.. గర్భధారణ స్థితిలో ఉన్న మహిళా అభ్యర్థులు జాబ్​లో చేరడంపై తాము కొత్త మార్గదర్శకాలేవీ జారీ చేయలేదని ఇండియన్ బ్యాంక్ కమిషన్‌కు తెలియజేసింది. ఏది ఏమైనప్పటికీ 1958లో గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా (GOI) జారీ చేసిన మార్గదర్శకాలైన.. ’12 వారాల పాటు గర్భవతిగా ఉన్నట్లు.. లేదా తాత్కాలికంగా అన్‌ఫిట్’గా ఉన్న మహిళ.. తమ సిబ్బందితో కలిసి పనిచేయడానికి నిరాకరించిన నిబంధనను 1985లో సవరించినట్టు తెలిపింది.

ఫిట్‌నెస్ ఫార్మాట్ ఏంటంటే..

అంతేకాకుండా.. అర్హతపై సందిగ్ధత లేకుండా చేసేందుకు తమ ‘ఫిట్‌నెస్ ఫార్మాట్’ను సవరిస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ మహిళా కమిషన్‌కు తెలియజేసింది. సవరించిన దాంట్లో కూడా గర్భాశయం, అండాశయాలు లేదా రొమ్ముల వ్యాధుల చరిత్రతో పాటు స్త్రీల గర్భధారణ స్థితిని కోరుతూ నిబంధనలున్నాయి.. అయితే దీనిపై కూడా మహిళా కమిషన్​ సీరియస్​ అయ్యింది. స్పష్టంగా సవరించిన ఫార్మాట్​లో కూడా మహిళలపై వివక్ష చూపుతున్నారని, ఎందుకంటే ఇది స్త్రీ-నిర్దిష్ట వ్యాధుల వివరాలను మాత్రమే పేర్కొనడం అందులో భాగంగానే పరిగణించాల్సి ఉంటుందని మహిళా కమిషన్​ తెలిపింది. అంతేకాకుండా పురుష-నిర్దిష్ట వ్యాధుల ప్రస్తావన ఎందుకు లేదని ప్యానెల్ ప్రశ్నించింది.

- Advertisement -

ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ..

DCW చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఈ విషయంలో అత్యవసర జోక్యం కోరుతూ DoPT, GOIకి లేఖ రాశారు. 35 ఏళ్ల క్రితం జారీ చేసిన పురాతన మార్గదర్శకాలను అనేక ఇతర బ్యాంకులు, విభాగాలు అనుసరిస్తున్నాయని కమిషన్ పేర్కొంది. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిశీలించి.. గర్భిణీ స్త్రీలను డ్యూటీలో చేర్చుకోవడంపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని కోరుతూ అన్ని శాఖలు, బ్యాంకులకు అత్యవసర వివరణ ఇవ్వాలని కమిషన్ DoPTని సిఫార్సు చేసింది. మహిళల పట్ల ఇకపై ఎలాంటి వివక్షను చూపకుండా ‘కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2022’కు అనుగుణంగా బ్యాంకు మార్గదర్శకాలను సవరించాలని కమిషన్ కోరింది.

“ఇండియన్ బ్యాంక్ తన సెక్సిస్ట్ మార్గదర్శకాలను ఉపసంహరించుకోకపోవడం చాలా దురదృష్టకరం. బదులుగా, వారు కొత్త ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను అమలులోకి తెచ్చారు. ఇది కూడా వివక్షతతో కూడినదిగా కనిపిస్తుంది. గర్భవతి అయితే స్త్రీని ‘తాత్కాలికంగా అన్‌ఫిట్‌’గా భావించే వ్యక్తుల పితృస్వామ్య మనస్తత్వానికి ఈ ఉదంతం ఒక అద్భుతమైన ఉదాహరణ! ఇదే విషయంలో కమిషన్ ఎస్‌బిఐకి నోటీసు జారీ చేసినప్పుడు.. వారు వెంటనే తమ స్త్రీద్వేషపూరిత మార్గదర్శకాలను ఉపసంహరించుకున్నారు” అని డిసిడబ్ల్యు చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement