Friday, April 26, 2024

ఇడియ‌ట్స్ లో క‌ల‌ర్స్ స్వాతి – ఫ‌స్ట్ లుక్ రిలీజ్

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌తో రావ‌ణాసుర చిత్రాన్ని నిర్మిస్తున్నారు అభిషేక్ పిచ్చ‌ర్స్ బ్యాన‌ర్ వారు. ఈ చిత్రంతో క‌మ్ బ్యాక్ ఇస్తోంది హీరోయిన్ క‌ల‌ర్స్ స్వాతి. కాగా తెలుగు చిత్రం ఇడియట్స్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ నేప‌థ్యంలో ఫ‌న్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీని పెంచుతున్నాడు ద‌ర్శ‌కుడు. ఆదిత్యా హాస‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిఖిల్ దేవాదుల, సిద్దార్థ్ శ‌ర్మ‌, శ్రీ హ‌ర్ష‌, ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమోఘ ఆర్ట్స్ అండ్ ఎంఎన్ఓపీ కో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సిద్దార్థ్ స‌దాశివుని మ్యూజిక్ కంపోజ‌ర్ కాగా..అజ‌మ్ మ‌హ్మ‌ద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. కొబ్బ‌రి చెట్టు ఊళ్లోకి వెళ్లే రోడ్డు..ఆ ప‌క్క‌నే చెరువు గ‌ట్టు, సినిమా పాత్ర‌లో బ్యాక్ డ్రాప్‌లో ఉన్న పోస్ట‌ర్ ..సినిమా ప‌క్కా ఎంట‌ర్ టైనింగ్‌గా ఉండనుంద‌ట‌.

https://twitter.com/AbhishekPicture/status/1522102864247926784
Advertisement

తాజా వార్తలు

Advertisement