Thursday, May 2, 2024

Rains: తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు.. ఆదిలాబాద్ లో చల్లబడిన వాతావరణం

తెలంగాణలో నాలుగు రోజులపాటు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణ కేంద్ర తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన ఆదిలాబాద్‌ జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తున్నది. నేరడిగొండ, బోథ్‌, ఆదిలాబాద్‌, బజార్‌ హత్నూర్‌, ఇచ్చోడ మండలాల్లో వర్షం కురుస్తున్నది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలో వాతారణం చల్లబడింది. ఇన్నిరోజులు ఎండలు, ఉక్కబోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement