Wednesday, May 15, 2024

భూమికీ ఓ సంగీతం ఉంది – వైర‌ల్ గా కోహ్లీ ట్వీట్

టీమిండియా క్రికెట‌ర్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఫొటో వైర‌ల్ గా మారింది. ప‌చ్చ‌ని ప‌చ్చిక బ‌య‌లుపై ప‌డుకుని సేద తీరుతున్నాడు. భూమాత‌పై త‌న‌కున్న గౌర‌వాన్ని, ప్రేమ‌ను వెల్ల‌డిస్తూ ఆ ఫొటోను కోహ్లీ పోస్ట్ చేశాడు. ప‌చ్చిక బ‌య‌లుపై ప్ర‌శాంత వ‌ద‌నంతో అలా వెల్ల‌కిలా నిర్మ‌లంగా ప‌డుకుండిపోయిన త‌న ఫొటోను పోస్ట్ చేసిన అత‌డు.. దానికి ఓ కామెంట్ కూడా పెట్టాడు. భూమికీ ఓ సంగీతం ఉంద‌ని చెప్పాడు. భూమికి ఉన్న సంగీతం.. దానిని వినాల‌నుకునే వారికే వినిపిస్తుంద‌ని అత‌డు ఆస‌క్తి రేకెత్తించే కామెంట్ పోస్ట్ చేశాడు.కోహ్లీ.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట‌ర్‌. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌కు ద‌డ పుట్టించే టీమిండియా క్రికెట‌ర్‌. అంతేనా.. తాను వ‌చ్చేనాటికి న‌మోదైన రికార్డుల‌ను ఒక్క‌టొక్క‌టిగానే అయినా.. చాలా వేగంగా వాటిని తిర‌గ రాస్తున్న స‌త్తా క‌లిగిన ప్లేయ‌ర్‌. ఇక బ్యాటు ప‌ట్టుకుని క్రీజులోకి దిగితే కోహ్లీ ముఖంలో ఏ మేర ఉద్వేగం తొణికిస‌లాడుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందుకే కాబోలు అత‌డికి కోపిష్టి అని కూడా పేరు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement