Saturday, May 4, 2024

బౌన్స‌ర్ లా స‌మంత‌ని కాపాడిన వ‌రుణ్ ధావన్ – వైర‌ల్ గా వీడియో

ఫొటో జ‌ర్న‌లిస్టుల నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌ని ఓ బౌన్స‌ర్ లా కాపాడాడు బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్. ఫొటో జర్నలిస్టుల ను పక్కకు వెళ్ళమంటూ సముదాయిస్తూ.. వాళ్లను ఉద్దేశిస్తూ సరదా వ్యాఖ్యలు చేశాడు. హేయ్..హేయ్.. జరగండి..జరగండి. ఎందుకు ఆమెను అలా భయపెడుతున్నార భయపెట్టకండి ఆమెను’’ అంటూ కామెంట్ చేశాడు. సమంతకు ఎస్కార్ట్ లాగా కారు వ‌ర‌కు వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న వరుణ్ ధావన్… రీల్ హీరోలా మాత్రమే కాదు రియల్ హరోగా బిహేవ్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వరుణ్ చేసిన పనికి ఇంప్రెస్ అవుతున్నారు అభిమానులు అమ్మాయిలయితే.. వరుణ్ కు ఫిదా అయిపోతున్నారు.సమంత, వరుణ్ ధావన్ నటించబోతున్న సిరీస్ ను తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేలు డైరెక్ట్ చేయబోతున్నారు. బ్రిటన్ లో ఇదే సిరీస్ కు ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా, ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో అభిమానులను అలరించిన సమంత.. ఇప్పుడు సిటడెల్ సీరిస్ తో బాలీవుడ్ కి మరింత దగ్గరకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement