Thursday, May 2, 2024

అంజ‌మ్మ‌గా ‘వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్’ – మోత మెగాల్సిందే

త‌మిళ‌న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ .. ‘క్రాక్’ .. ‘నాంది’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. హీరో బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలోను, ‘హనుమాన్’ సినిమాలోను ఆమె చేస్తుందనే టాక్ వినిపించింది. తాజాగా ‘హనుమాన్’ నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ‘అంజమ్మ’ అంటూ ఆమె పాత్ర పేరును కూడా పరిచయం చేశారు. ఈ పోస్టర్ లో ఆమె పెళ్లి కూతురు లుక్ తో కొబ్బరి గెల పట్టుకుని రౌడీలను ఉతికి ఆరేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంజనాద్రి నేపథ్యంలో ఈ సన్నివేశం జరుగుతున్నట్టుగా చూపించారు. బహుశా ఆమె కథానాయకుడికి తల్లి పాత్రను ధరించి ఉంటుందని అనుకోవచ్చు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అమృత అయ్యర్ అలరించనుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement