Saturday, May 18, 2024

జార్ఖండ్ లో కేసీఆర్ కు ఘనస్వాతం.. దేశవ్యాప్తంగా పెరిగిన ఆదరణ

ఫెడరల్ ఫ్రంట్ లో ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ గురించి చర్చ జరుగుతోంది. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. నిన్న రైతు పక్షపాతి, నేడు సైనిక పక్షపాతిగా కేసీఆర్ మారరు అని అంటున్నారు. గల్వాన్ లోయలో చైనా దాడిలో మరణించిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్…జార్ఖండ్ లోని రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు స్వయంగా వెళ్లారు. దీంతో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాంచీ పట్టణంలో ఎక్కడ చూసిన కేసీఆర్ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయి.

ఇప్పటికే సీఎం కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ పెరుగుతున్నది. ఇవాళ సైనికుల కుటుంబాలకు ఆర్థిక అందించడం పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నాయకుడు అంటే కేసీఆర్ లాగా ఉండాలి అంటున్న జాతీయ రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొదటిగా మద్దతు ఇచ్చిన సిబూ సొరేన్ గుర్తు చేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు కోసం మొదటి సారి సిబుసోరెన్ దగ్గరకు వెళ్తున్న సీఎం కేసీఆర్.. రాంచీలోని గిరిజన ఉద్యమకారుడు బిర్సా ముండా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement