Monday, April 29, 2024

విజిల్ మ‌హాల‌క్ష్మిగా కృతిశెట్టి – ‘వారియ‌ర్’ ఫ‌స్ట్ లుక్

వారియ‌ర్ అనే చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు,త‌మిళంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ది వారియర్‌ అనే టైటిల్‌ ను ఇటీవలే అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. అయితే… ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. విజిల్‌ మహాలక్ష్మి అనే క్యారెక్టర్‌ లో కృతి శెట్టి నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్టు లుక్‌ ను విడుదల చేశారు. స్కూటీపై కృతి శెట్టి కూర్చిని.. అందరినీ ఈ లుక్‌ తో ఆకట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement