Friday, May 17, 2024

అందాల లావణ్యం.. భుజాల దిగువన ట్రెండీ వేర్ లో మ‌తిపోగోడుతున్న అందాల రాక్షసి..

ప్రేమికుల రోజు సెలెబ్రేషన్స్ లో మునిగిపోయింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. రెడ్ హార్ట్ సింబల్స్ మధ్య నిల్చొని క్రేజీ ఫొటో షూట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేమకు తనదైన శైలిలో అర్థం చెప్పింది ఈ అమ్మ‌డు. ‘ప్రేమ నిరంతరం నిర్మించుకునే టు వే స్ట్రీట్’ అంటూ చిన్న కోట్ పోస్ట్ చేసింది. ప్రేమికులరోజు నాడు భుజాల దిగువకున్న ట్రెండీ వేర్ లో లావణ్య సూపర్ గ్లామరస్ గా క‌నిపించింది. అయితే ఈ రోజును త‌ను సింగిల్ గానే సెలబ్రేట్ చేసుకుంటోంది.

ఇటీవల మెగా కోడలు అవుతుందన్న పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ లావణ్యపై మనసు పడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగ‌ళూరు వెళ్లాడని గుస‌గుస‌లు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో ఈ వార్త సోష‌ల్ మీడియాలో కోడై కూసింది. ఏడాది క్రితం రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య, రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్యతో వరుణ్ పెళ్లి వార్తలు నిజ‌మేనేమోన‌ని న‌మ్మారు. అయితే.. ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య పరోక్షంగా స్పష్టత ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement