Sunday, May 5, 2024

ఉద్యోగ కల్పన లో ‘పల్సస్’ కే మొదటి స్థానం – సీఈఓ డాక్టర్ శ్రీను బాబు గేదెల

నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని ఆ సంస్థ సీఈవో డాక్టర్ గేదెల శ్రీను బాబు అన్నారు.పల్సస్ దినదినాభివృద్ధి చెందుతూ.. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తూ ,ప్రతి ఏటా కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 3ఏళ్ల క్రితం పల్సస్ ఏర్పాటుచేసి 3,500 మందికి ఉపాధి కల్పించామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ డిజిటల్ మార్కెటింగ్ లో యువతకు శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో కంపెనీ ఉత్పత్తులను ప్రచారం చేసే విధంగా ముందుకు సాగుతుంది అన్నారు. విశాఖ నగరంలోని చిల్డ్రన్స్ ఎరెనా లో జరిగిన పల్సస్ సంస్థ 14వ వార్షికోత్సవంలో భాగంగా ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త డిజిటల్ ఐటి హబ్ మధురవాడ ఐటీ పార్క్ లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. 60 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారన్నారు.2021 సంవత్సరలో 3500 వెబినార్ లు, 700 జర్నల్స్ ప్రచురించామన్నారు.
ప్రస్తుతం 7 సెజ్ ల్లో, 5 నుంచి ,6 వేల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించామన్నారు.

రానున్న కాలంలో మరో పది వేల ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా వారిని కుటుంబ సభ్యుల్లాగ చూసుకుని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఒమిక్స్,పల్సస్ ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, ఔషధ శాస్త్ర రంగాల్లో పరిశోధనకు అవసరమైన విషయాలను ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉంచుతుందని తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా వేలాది ఇంటర్నేషనల్ సెమినార్లు ఏర్పాటు చేసి ప్రముఖుల ప్రశంసలు పొందారు ..విద్యను విజ్ఞానంగా మార్చి పరిశోధలనే పరిశ్రమగా తీర్చిదిద్ది ,సంపదను సృష్టించేందుకు వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్తున్నామన్నారు. తాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డి పొంది, అమెరికాలోని స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పాతికేళ్లకే పోస్ట్ డాక్టరేట్ సాధించి యువ శాస్త్రవేత్త గా ప్రపంచ దేశాల అన్నింటిలో భారత దేశ గౌరవాన్ని పేరుప్రఖ్యాతులను సాధించే విధంగా కృషి చేశారు ప్రతి విద్యార్థి తనలాగే పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. తాను కూడా అ ఒక సామాన్య కుటుంబం నుంచే వచ్చానన్నారు. ప్రస్తుతం పల్సస్ అమెరికా, సింగపూర్ , బ్రిటన్, బెల్జియం దేశాల్లోనే కాకుండా భారతదేశంలో విశాఖ,హైదరాబాద్ ,చెన్నై గురుగావ్ నగరాలకు విస్తరించిందని చెప్పారు. రానున్న కాలంలో మరిన్ని ముఖ్య నగరాల్లో పల్సస్ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా పల్సస్ సీఈవో డాక్టర్ శ్రీనుబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రాజకీయ ప్రముఖులు ఆయన్ని సత్కరించారు.ఉద్యోగులు ఆయన్ని ఘనంగా ఘజమాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. పల్సస్ సంస్థ ప్రతినిధి గేదెల శంకర్రావు మాట్లాడుతూ మధురవాడ టైటిల్ను 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్, రెండు లక్షల యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పల్ససె సిబ్బంది సంస్థ విభాగాధిపతులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement