Monday, April 29, 2024

డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లకు అప్‌డేట్‌.. జ‌న‌వ‌రి నుంచి మారనున్న రూల్స్‌..

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు ముఖ్య గ‌మ‌నిక.. ఇక‌పై అన్ని డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ట్రాన్జాక్ష‌న్ల‌ విషయంలో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్‌ను రిజర్వ్‌ బ్యాంకు అందుబాటులోకి తెస్తోంది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే ట్రాన్సాక్ష‌న్స్‌ని మరింత సేఫ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించి జరిపే ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయా వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో అంతకుముందే నిక్షిప్తమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇకపై నిక్షిప్తం కావు.

ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు చేసేట‌ప్పుడు ఆ‍యా వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమలులోకి రానున్న‌ట్టు తెలిపింది ఆర్‌బీఐ. దీంతో వ‌చ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా 16 అంకెల డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నంబర్లతో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఇది వీలు కాకుంటే…టోకెనైజేషన్ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఆర్బీఐ 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది.

టోకెనైజేషన్‌ అంటే ఏమిటి..?
ఆన్‌లైన్‌ లావాదేవీలను జరిపేటప్పుడు ఖాతాదారులు 16 అంకెల క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలను గుర్తుంచుకోక పోతే.. టోకెనైజేషన్ విధానాన్ని వాడవచ్చు. ఈ సిస్టంతో ఆయా క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ ఎన్‌క్రిప్టెడ్‌ కోడ్‌ను బ్యాంకులు ఇస్తాయి. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement