Monday, May 13, 2024

యూపీ ప్లస్​ బిహార్​, గయీ మోదీ నినాదం.. బీజేపీని పడగొట్టేందుకు స్పీడందుకున్న వ్యూహం

సీఎం కేసీఆర్​ జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీని పడగొట్టేందుకు మెయిన్​ ఫ్రంట్​ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బిహార్​ సీఎం నితీశ్​కుమార్​తో పాటు పలువురు లీడర్లతో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. ఈ క్రమంలో నిన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా తెలంగాణకు వచ్చి సీఎం కేసీఆర్​తో జాతీయ రాజకీయాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూలంకశంగా చర్చించారు. ఆ తదుపరి సీఎం కేసీఆర్​ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని ప్రకటించారు.

కాగా, ఇప్పుడు ‘‘యూపీ ప్లస్​ బీహార్​ గయీ మోదీ’’ నినాదం ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నినాదం బీహార్​, ఉత్తరప్రదేశ్​ రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఇక.. ములాయం, అఖిలేష్​తో నితీశ్​కుమార్ టచ్​లో ఉన్నట్టు తేజస్వీ ఇవ్వాల చేసిన ప్రకటన ఇంకాస్త హీట్​ని పెంచింది. కేంద్రంలో బీజేపీని పడగొట్టేందుకు మెయిన్​ ఫ్రంట్​ కొత్త వ్యూహం పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement