Monday, May 13, 2024

‘రామ్ చ‌ర‌ణ్’ కి రెండు మార్కులు ఎక్కువిస్తా – విజ‌యేంద్ర‌ప్ర‌సాద్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం రేపే రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ ఒక రేంజ్ లో జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. అందుకు విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ .. ” అడవితల్లి బిడ్డ కావడం వల్లనేమో ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్ పాత్ర నాకు నచ్చింది. అడవిపూవులా ఆ పాత్ర తెరపై స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఆ పాత్రలో ఎన్టీఆర్ చాలా గొప్పగా చేశాడు. ఇక చరణ్ విషయానికి వస్తే ఒక వైపున పోరాటం .. మరో వైపున మాసిక సంఘర్షణ అనుభవించే అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. అల్లూరి పాత్రలో వేరియేషన్స్ .. లేయర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పాత్రను పోషించడం చాలా కష్టం.ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ను అన్నా అని పిలుస్తాడు. చరణ్ పాత్రలో ఆ పరిణతి కనిపిస్తుంది. నిజానికి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమా వరకూ నేను చరణ్ కి రెండు మార్కులు ఎక్కువిస్తాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement