Tuesday, May 14, 2024

Top Story – గ్రేట‌ర్ లో గ్రేట్ ఫైట్..ప్ర‌చారంలో కారు జోరు..హ‌స్తంలో సీట్ల పంచాయితీ…క‌మలంలో నిశ్శ‌బ్ధం…

గ్రేటర్‌ హైదరాబాద్‌, ప్రభ న్యూస్‌ బ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఈపాటికే విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లు వెతా ్తల్సిన తరుణంలో సొంత పార్టీల్లోనే అలకలు, బుజ్జ గింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌, బీజె పీల జాబితాలు వెలువడలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రక టించిన నియోజకవర్గాల్లో అసమ్మతి గళం వినిపిస్తోంది. సీట్లను అమ్ముకున్నారంటూ, ఏళ్లుగా పనిచేస్తున్నా గుర్తిం పు ఇవ్వక పోగా అవమానించారంటూ ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారజోరు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. దాదాపు అన్ని నియోజక వర్గాల్లోనూ తొలి విడత పాదయాత్రలు, వివిధ ప్రభుత్వ కార్య ³కలాపాల పేరిట నియోజకవర్గాలను సిట్టింగ్‌లంతా చుట్టేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తన నియో జకవర్గాన్ని చుట్టిరావడంతో పాటు, కంటోన్మెంట్‌ నియో జకవర్గంలోనూ అభ్యర్థి లాస్య నందిత విజయం కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లిd నియో జక వర్గాలపైనా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. నాయ కుల మధ్య విబేధాలకు పరిష్కారం చూపి, అందరినీ ఏక తాటిపైకి తీసుకు వచ్చేందుకు మంత్రి తలసాని తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం బస్తీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, డివిజన్‌ కార్యకర్తల సమావేశాలతో ఎమ్మె ల్యే బి జీబి జీగా గడుపుతున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలోనూ అరికెపూడి గాంధీ తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. అన్ని డివిజన్లలో పాదయాత్రలు నిర్వహించి హ్యాట్రిక్‌ విజయం అందించాలని ఓటర్లను కోరు తు న్నారు. జూబ్లిdహిల్స్‌ నియోజకవర్గంలో మాగంటి గోపీ నా థ్‌ సైతం పాదయాత్రతో అన్ని డివిజన్లలో కలియ తిరుగు తున్నారు. అడపాదడపా వివాదాలు చుట్టుముడుతున్నా, ఆయన మొక్కవోని దీక్షతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తు న్నారు.

మరోవైపు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ మూడోసారి విజయమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నారు. వందరోజులకు పైబడి పాదయాత్ర నిర్వహించిన ఆయన, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థి దానం నాగేందర్‌ సైతం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఎన్నికల కోడ్‌ కూసిన వేళ ప్రత్యర్థులు ఎవరో తెలియకుండానే ప్రచారంలో జొ రు పెంచారు. డిప్యూటీ స్పీకర్‌, సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అ భ్యర్థి పద్మారావు గౌడ్‌ సైతం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తు న్నారు. డివిజన్ల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వ హిస్తూ వస్తున్నారాయన. మరోవైపు ఉప్పల్‌ నియోజ కవ ర్గంలో బండారు లక్ష్మారెడ్డి ప్రచారం కంటే కూడా, డివిజన్ల వారీగా సమావేశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయా డివిజన్ల నాయకులను కలుపుకొని ముందుకు సాగేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎల్బీనగర్‌ నియోజక వర్గం లో దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగి స్తున్నారు. ఇప్పటికే మార్నింగ్‌ వాక్‌ల పేరిట అన్ని డివి జన్లలో కలియతిరిగిన ఆయన, నాయకులు, కార్యకర్తలతో డివిజన్లు, వార్డుల వారీగా సమావేశాలు నిర్వహిస్తు న్నా రు. మరోవైపు అంబర్‌పేట్‌, ముషీరాబాద్‌ నియోజక వర్గాల్లో కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌లు విస్తృతంగా తిరుగుతున్నారు. అసమ్మతి ఉన్నప్పటికీ అందరినీ కలు పుకొని ముందుకు సాగుతున్నారు. కార్వాన్‌, నాంపల్లి సహా పాతబస్తీ నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ ప్రచారం సాగిస్తున్నప్పటికీ, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోనూ అభ్యర్థి ప్రకాష్‌ గౌడ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ ఎంసీ పరిధి మినహా మిగతా ప్రాంతాల్లో జోరుగా ప్రచా రం నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌లో కల్లోలం
కాంగ్రెస్‌ తొలి జాబితా ప్రకటించి, ఇబ్బందులు తెచ్చు కున్నట్లయింది. ఆ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరిం చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉప్పల్‌లో ఆ పార్టీ అభ్యర్థిగా ముందముళ్ల పరమేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించడంతో ఇంతకాలం పార్టీ అభ్యర్థిగా ప్రచా రం చేసుకున్న రాగిడి లక్ష్మారెడ్డి భగ్గు మన్నారు. ఎల్బీనగర్‌లో అభ్యర్థి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో ఆశా వహులు ఇంకా ఎదురు చూపులు చూస్తున్నారు. మధుయాష్కీ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, బీసీ కార్డు వాడితే స్థానికుడైన ముద్దగోని రామ్మోహన్‌ గౌడ్‌కు కేటాయించాలని, లేని పక్షంలో తమ కే కేటాయించాలని జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మల్‌రెడ్డి రాం రెడ్డిలు కోరుతున్నారు. సికింద్రాబాద్‌లో ఆదం సంతోష్‌కుమార్‌కు, సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కోట నీలిమలకు హస్తం పార్టీ అవకాశం కల్పించడంతో వారు ప్రజాక్షేత్రంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధ మయ్యారు. మరోవైపు కారు పార్టీకి చెక్‌ పెట్టే వ్యూహంతో కార్పొరేటర్‌ విజయారెడ్డికి హామీనిచ్చి, హస్తంవైపు ఆకర్షిం చిన ఆ పార్టీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ప్రస్తుతం ఖైరతాబాద్‌ విష యంలో స్పష్టతనివ్వక పోవడంతో విజయారెడ్డి పరిస్థితి అయోమయంగా మారింది. ఇదే నియోజకవర్గం నుంచి రోహిన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక జూబ్లి హిల్స్‌ నియోజకవర్గంలో మాజీ క్రికెటర్‌ అజా రుద్దీన్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డిల పేర్లు వినిపి స్తుండగా, అజారుద్దీన్‌ వైపే మొగ్గుచూపే అవకాశా లున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేరు ఖరా రైనప్పటికీ, ప్రచారం ప్రారంభించాల్సి ఉంది.

- Advertisement -

బిజెపిలో కాన‌రాని సంద‌డి..

బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల స్థాయిలో పోటీనిస్తుం దని భావించినప్పటికీ, ఆ పార్టీలో సందడి కానరావడం లేదు. ముఖ్యంగా ఆ పార్టీ సైతం వలసలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం రసవత్త రంగా మారింది. ఎల్బీనగర్‌ నియోజక వర్గంలో సామ రంగారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సైతం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ – కమ్యూనిస్టుల పొత్తు ఖరారైతే మునుగోడు వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల కేటాయింపు పూర్తయి, జాబితాలు విడుదల అయితే తప్పా, ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆశావహులంతా బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పిస్తూ, తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement