Monday, October 7, 2024

AP: త‌ల్లి వ‌ర్ధంతికి వెళ్లనీయకుండా మాజీ మంత్రిని అడ్డుకోవ‌డం దారుణం.. నారా భువ‌నేశ్వ‌రి

త‌ల్లి వ‌ర్ధంతికి కూడా వెళ్ల‌నీయ‌కుండా మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకోవ‌డం దారుణ‌మ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల నిర్బంధం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని ఆమె విమర్శించారు. ఇలా అడ్డుకోవడం దేశంలో మరెక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి తనను ఎంతో బాధించిందని చెప్పారు.

ఇదేమి చట్టం, ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసేవారో ఈ ఘటన చూస్తే అర్థమవుతుందని భువనేశ్వరి అన్నారు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత హక్కులను, సంప్రదాయాలను రాజకీయాలతో ముడి పెట్టవద్దని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement