Saturday, April 27, 2024

టాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌.. గూఢ‌చారి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ సూపర్‌ స్టార్ కృష్ణ‌

టాలీవుడ్ జేమ్స్‌బాండ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్రెస్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌. 1965లో తేనె మనసులు చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయ‌న ఆ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీలో ఎన్నో మ‌రుపురాని రికార్డుల‌ను సృష్టించారు. అంతకు మందే పలు చిత్రాల్లో నటించిన కృష్ణ‌ చిన్న చిన్న పాత్రలు కూడా పోషించారు. 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం తేనె మనసులు. ఈ చిత్రంలో హీరోగా కృష్ణకు ఆయన అవకాశం కల్పించారు.

సూపర్‌స్టార్‌ 1966లో వచ్చిన గూఢచారి 116తో తొలిసారి స్పై జోనర్ తరహా చిత్రాలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు కృష్ణ. ఆ తర్వాత 1967లో హీరోగా నటించిన సాక్షి చిత్రం తాష్కెంట్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌లో స్ట్రీమింగ్‌ అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1972లో నటించిన పండంటి కాపురం ఉత్తమ ఫీచర్‌ ఫిలిమ్‌ (తెలుగు) నేషనల్‌ అవార్డు అందుకుంది. మైథలాజికల్‌, డ్రామా, వెస్టర్న్‌, ఫాంటసీ, యాక్షన్‌, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.

కృష్ణ నటించిన స్పై జోనర్‌ సినిమాలు గూడఛారి 116, జేమ్స్‌ బాండ్‌ 777, ఏజెంట్ గోపీ, రహస్య గూడఛారి, గూడఛారి 117. అప్ప‌ట్లోనే కాదు.. నేటి త‌రానికి కూడా ఈ సినిమాలు ఎంతో ఆస‌క్తిని, ఇన్‌స్పిరేష‌న్‌ని క‌లిగిస్తాయి.

కృష్ణ డైరెక్ట్ చేసిన‌ సినిమాలు..
17 ఫీచర్‌ ఫిలిమ్స్‌తోపాటు శంఖారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న తమ్ముడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలన్నింటిలో కుమారుడు మహేశ్ బాబు చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించాడు. సొంత బ్యానర్‌ పద్మాలయ స్టూడియోస్‌ బ్యానర్‌లో తన సోదరులు ఆదిశేషగిరి రావు, హన్మంతరావు కలిసి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో తెలుగు యాక్టర్లలో అత్యధిక రెమ్యునరేషన్‌ అందుకున్న హీరోగా అరుదైన రికార్డు కూడా కృష్ణ ఖాతాలో ఉన్నది. కెరీర్‌లో ఆదుర్తి సుబ్బారావు, వీ మధుసూదన రావు, కే విశ్వనాథ్‌, బాపు, దాసరి నారాయణ రావు, కే రాఘవేంద్రరావు లాంటి దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement