Tuesday, May 14, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. నేడు బంగారం ధర హైదరాబాద్, దిల్లీ మార్కెట్లో ఒక్కరోజే భారీగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.600 పెరగ్గా ప్రస్తుతం రూ.55,300 మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు ఒక్క రోజే రూ.660 మేర ఎగబాకి 10 గ్రాములకు ప్రస్తుతం రూ.60330 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు రోజు మాత్రం 10 గ్రాములకు రూ. 300 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు వరుసగా పెరిగాయి. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో .. దిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. తాజాగా 10 గ్రాముల బంగారం రేటు 22 క్యారెట్లకు ఒక్కరోజు రూ.600 పెరిగి రూ.55,450 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.60,480 వద్ద ఉంది. బంగారం ధరలతో పాటు సిల్వర్ రేట్లు కూడా తాజాగా పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ.600 పెరిగి ప్రస్తుతం రూ.74,600 మార్కు వద్ద ఉంది. అంతకుముందు రోజు రూ.500 మేర పడిపోయింది. ఇక హైదరాబాద్‌లో చూస్తే వెండి రేట్లు తాజాగా రూ.700 పెరిగి రూ.77,800 కి చేరింది. ఇదే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. ఇక సాధారణంగా హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇదే వెండి రేట్ల విషయానికి వస్తే మాత్రం దిల్లీలో కాస్త స్వల్పంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement