Wednesday, May 15, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్స్‌కు ఇవాళ రూ.300 పడిపోయి రూ.55,800 మార్కుకు పడిపోయింది. 3 రోజుల వ్యవధిలో ఈ రేటు రూ.950 మేర తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.330 తగ్గగా.. ఇప్పుడు రూ.60,870 వద్ద ట్రేడవుతోంది. ఇది చూస్తే 3 రోజుల్లోనే రూ. 1040 మేర తగ్గుముఖం పట్టింది.దిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల గోల్డ్ రేటు 22 క్యారెట్లకు తాజాగా రూ.300 తగ్గగా రూ.55,950 వద్ద ఉంది. అదే 24 క్యారెట్స్ విషయానికి వస్తే రూ.330 తగ్గి రూ.61,020కి చేరింది. సిల్వర్ రేటు దిల్లీలో తాజాగా రూ.200 తగ్గగా.. కిలో ఇప్పుడు రూ.74,300 మార్కును తాకింది. హైదరాబాద్‌లో వెండి ధర తాజాగా రూ.100 తగ్గి రూ.78 వేల మార్కు వద్ద కొనసాగుతోంది.బంగారం ధర వరుసగా తగ్గుతూ కొనాలనుకునేవారికి పెద్ద ఊరట కల్పిస్తోంది. ఇటీవలి కాలంలో గోల్డ్ రేటు జీవన కాల గరిష్టాలను తాకింది. బంగారం ధర పడుతుందనుకుంటుంటే.. అక్కడి నుంచి పెరుగుకుంటూ పోయింది. ఇదే క్రమంలో రికార్డు గరిష్టాలకు వెళ్లింది. ఇక ఇప్పుడు మాత్రం గోల్డ్ రేటు పడిపోతోంది. వరుసగా 3 రోజులుగా బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement