Sunday, April 28, 2024

తిరుమ‌ల శ్రీవారి హుండీకీ భారీగా ఆదాయం-ఆగ‌స్టులో స‌రికొత్త రికార్డ్

తిరుమ‌ల శ్రీవారికి వ‌రుస‌గా ఆరో నెల కూడా ఆదాయం రూ. 100కోట్లు దాటింది.ఆగస్టులో 5, 5.15, 5.30, 5.86.. ఇలా రూ.5 కోట్లకు పైగా కానుకలు హుండీకి వచ్చాయి. అంతేకాదు గత నెలలో కేవలం 22 రోజులకే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటేసింది. ఆగ‌స్టు నెల కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.140 కోట్ల వస్తుందని భావించారు.. అనుకున్నట్లే రికార్డ్ నమోదైంది. తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలలో కూడా సరికొత్త రికార్డ్ నమోదైంది. గత నెలలో దాదాపు 22లక్షల 80వేల 84మంది భక్తులు స్వామి దర్శించుకోగా.. శ్రీవారికి హుండీ ద్వారా రూ.140కోట్ల 7లక్షల ఆదాయం లభించింది. దాదాపు 10లక్షల 79వేల 900మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

టీటీడీ అధికారికంగా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది. జులైలో 23.40లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆగ‌స్టు నెలలోనే 1.07 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయించగా.. శ్రీవారికి 10.97లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 53.41 లక్షలమంది అన్నప్రసాదం స్వీకరించగా.. ఆదాయం ఏకంగా రూ.139.33 కోట్లు వచ్చింది. జులైలో కూడా కేవలం 21 రోజుల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. జూన్‌‌ నెలలో శ్రీవారిని 23.23 లక్షలు మంది భక్తులు దర్శించుకున్నారు. 95.34 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించగా.. 50.61 లక్షలమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 11.61 లక్షలమంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే హుండీ ఆదాయం రూ.123.74 కోట్ల కాగా.. మే నెలలో రూ.130 కోట్లు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement