Thursday, May 2, 2024

కేజీఎఫ్ 3 కూడా ఉండ‌నుందా..!

నేడు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చింది కేజీఎఫ్2 చిత్రం. ఈ చిత్రంలో హీరోగా క‌న్న‌డ స్టార్ య‌శ్ న‌టించాడు. కాగా సినిమా ప్రీమియర్‌ షో చూసిన ప్రతి ఒక్కరూ.. బంపర్‌ హిట్‌ అని చెబుతున్నారు. బీస్ట్‌ అంచనాలను అందుకోకపోవడంతో.. కేజీఎఫ్‌ కే వెళుతున్నారు ప్రేక్షకులు. అయితే.. ప్రీమియర్‌ షో ద్వారా కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3 కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. పవర్‌ ఫుల్‌ పొలిటీషీయన్‌ రోల్‌ పోషిస్తున్న రవీనా టండన్‌ కేజీఎఫ్‌ పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో.. కవర్‌ పేజీని తిప్పే..నేపథ్యంలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 3అనికనిపించడాన్ని ఆ వీడియోలో మనం చూడవచ్చు. దీంతో కేజీఎఫ్‌ చాప్టర్ 3 వస్తుందనేది అర్థమవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఈ సినిమా ప్రమోషన్లలోనూ.. కేజీఎఫ్‌ 3 చాప్టర్‌ వస్తుందనే దానిపై ప్రశాంత్ నీల్‌ కూడా సానుకూలంగా స్పందించారు. మ‌రి కేజీఎఫ్ కి కొన‌సాగింపు ఉంటుందో లేదో చిత్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించాల్సి ఉంది.

https://twitter.com/itz_karthickvj/status/1514441709618294784
Advertisement

తాజా వార్తలు

Advertisement