Monday, May 6, 2024

T20: టీమిండియాతో తలపడే పాక్ టీమ్‌ ఇదే..

Squad Pakistan: రేపు భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం 12 మంది టీమ్ మెంబ‌ర్స్‌తో ఫైన‌ల్ జ‌ట్టు లిస్ట్ అవుట్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం. భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లోనైన గెలిచి టీ20 ప్రపంచకప్ 2021లో శుభారంభాన్ని అందించాలని పాక్ భావిస్తుంది.

జ‌ట్టులో మాలిక్, హఫీజ్ వంటి అనుభవం ఉన్న ప్లేయ‌ర్స్‌ ఆలోచనలు, ప్రణాళికలు జట్టుకి సహాయపడుతాయని, కొంతకాలంగా యూఏఈలో మ్యాచ్ లు ఆడటం వలన ఇక్కడి పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ మ‌ధ్య‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ – పాక్‌ మ్యాచ్ లో పాక్ జట్టు తరపున ఆడబోయే 12 మంది ఆటగాళ్ళ జాబితా ఇలా ఉంది.

పాకిస్తాన్ జట్టు: బాబర్ అజామ్ (C), మహ్మద్ రిజ్వాన్ (Wk), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ హఫీజ్, మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ (VC), ఇమాద్ వసీం, హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్

Advertisement

తాజా వార్తలు

Advertisement